News August 14, 2025
ADB: ‘సీఐ కరుణాకర్ సేవలు అభినందనీయం’

ADB టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు అందించిన సేవలు అభినందనీయమని డీఎస్పీ జీవన్‌రెడ్డి కొనియాడారు. బుధవారం సాయంత్రం ఘన్‌పూర్ సర్కిల్‌కు బదిలీపై వెళ్తున్న కరుణాకర్ రావుకు డీఎస్పీతో పాటు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై విష్ణుప్రకాష్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కరుణాకర్‌రావు తీసుకున్న చర్యలు అమోఘమని ప్రశంసించారు.
Similar News
News August 15, 2025
రాష్ట్రపతి విందులో పాల్గొన్న ADB ఉపాధ్యాయుడు

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని at home కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుతులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విందులో పాల్గొన్నారు. కైలాస్ రాష్ట్రపతి, ప్రధానీకి గోండి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్పించాలని విన్నవించారు.
News August 15, 2025
ADB: రాగి తీగలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

రాగి తీగలు చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఎస్ఐ రమ్య సీసీఐ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రకు చెందిన దేవీదాస్, లాండసాంగికి చెందిన రాజేశ్వర్, శివాజీలను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద ఉన్న సంచిలో 30 కిలోల రాగి తీగలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామన్నారు.
News August 15, 2025
ADB: ‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’

CPSను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని PRTU TS జిల్లాధ్యక్షుడు కొమ్ము కృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినం గోడప్రతులను జిల్లా ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.