News October 28, 2025

ADB: సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండి లేకుంటే ప్రమాదమే

image

సెల్ ఫోన్లు చోరీకి గురైనా, మనం పోగొట్టుకున్నా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకుల్లోని డబ్బులు లూటీ చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయాలి. లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు పోలీసులు ఫోన్ ను ట్రేస్ చేసి అందిస్తారు. జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 1300 ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు.

Similar News

News October 28, 2025

కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్‌లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 28, 2025

GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

image

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.

News October 28, 2025

HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

image

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్‌తో ఛాటింగ్‌కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.