News October 9, 2025

ADB: స్కాలర్ షిప్ కోసం APPLY చేసుకోండి

image

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT

Similar News

News October 9, 2025

ADB: ఈ కార్యాలయాలు మారాయి.. గమనించండి

image

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టరేట్ భవనం పాక్షికంగా కూలిపోవడంతో పలు కార్యాలయాలు తాత్కాలిక మార్పులు జరిగాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పెన్ గంగ భవన్‌కు, కలెక్టరేట్ విభాగాలు AO నుంచి H వరకు పెన్ గంగ భవన్‌కు, తహశీల్దార్ (అర్బన్) జెడ్పీ ఆఫీస్‌కు, డీఎస్ఓ ఆఫీస్ రోడ్లు భవనాల (R&B) శాఖ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 9, 2025

ADB: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఈ నెల 9 నుంచి ఎస్ఈసీ విడుదల చేయనున్న నేపథ్యంలో రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 9న నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్లు స్వీకరించడం, 23న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొదటి విడతలో 80 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు.

News October 8, 2025

హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి: ADB కలెక్టర్

image

నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆర్ఓ, ఏఆర్ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీఈఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.