News September 23, 2025
ADB: స్థానిక పోరు.. చేరికల జోరు

స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే చేరికలపై దృష్టి సారించాయి. అన్ని పార్టీలు మీటింగ్లు పెడుతూ గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులను చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్‌ను వీడిన నేతలు మళ్లీ పార్టీలో చేరారు. మండల స్థాయి సమావేశాలు పెడుతూ BJP చేరికలపై ఫోకస్ పెట్టింది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే మళ్లీ ఆరోజులు రావాలంటూ BRS జోరు పెంచింది. లోకల్ వార్ రసవత్తరంగా మారింది.
Similar News
News September 23, 2025
MLG: CM మీటింగ్.. తాగునీరు లేక అల్లాడుతున్న మహిళలు

తాడ్వాయి మండలం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. సుమారు 3 గంటలకు పైగా వేచి ఉన్న తమకు కనీసం తాగునీరు, స్నాక్స్ కూడా ఇవ్వడం లేదని మహిళలు వాపోయారు. దాహం, ఆకలితో అలమటిస్తున్నామన్నారు. ఎవరిని అడిగినా కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, ఉక్కపోత, దప్పికతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News September 23, 2025
MRKP: వచ్చే ఏడాది పులుల లెక్కింపు

నల్లమల్ల ఫారెస్ట్‌లోని వన్యప్రాణులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మార్కాపురం DFO మహమ్మద్ రఫీ తెలిపారు. ‘ఎకో టూరిజంలో గైడ్లను ఏర్పాటు చేసి అడవుల ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తాం. వచ్చే ఏడాది కేంద్ర బృందం ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాల ద్వారా పులుల లెక్కింపు జరుగుతుంది’ అని వెల్లడించారు.
News September 23, 2025
‘OG’లో అకీరానందన్?

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ఆయన కుమారుడు అకీరానందన్ నటించినట్లు చర్చ జరుగుతోంది. కత్తిపై ఓ కుర్రాడి కళ్లు కనిపించగా.. అవి అకీరావేనని ఫ్యాన్స్ అంటున్నారు. కచ్చితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ పక్కన రాహుల్ రవీంద్రన్ నటించగా ఎడిటింగ్‌లో ఆ పాత్రను తొలగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అది దర్శకుడి నిర్ణయమని ఓ ఫ్యాన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.