News November 13, 2025

ADB: స్విమ్మింగ్‌లో దూసుకుపోతున్న చరణ్ తేజ్

image

ఆదిలాబాద్‌కి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన అతడు తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపాడు.

Similar News

News November 13, 2025

ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

image

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.

News November 13, 2025

WNP: భూ సేకరణ పనులు వేగవంతం చేయండి

image

వనపర్తి జిల్లాలో చేపడుతున్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సర్వే ప్రక్రియలను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గణప సముద్రం రిజర్వాయర్ కోసం భూసేకరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 197 ఎకరాలకు సంబంధించి ఎంజాయ్మెంట్ సర్వే ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 13, 2025

ధాన్యం డబ్బులు చెల్లింపుల్లో జనగామ జిల్లా ఫస్ట్: కలెక్టర్

image

ఒక యాక్షన్ ప్లాన్‌తో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ధాన్యం కొనుగోలు పురోగతిపై వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి ధాన్యం డబ్బుల చెల్లింపులో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.