News October 11, 2025
ADB: హస్తానికి కొత్త సారథి.. ఎవరవుతారో మరి?

జిల్లాలో కాంగ్రెస్‌కు త్వరలో కొత్త సారథి రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని అప్పటి అధ్యక్షుడు సాజీద్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. రెండేళ్లుగా పదవి ఖాళీగానే ఉంది. అందరిని కలుపుకొనిపోయే వాళ్ల కోసం అధిష్ఠానం వెతుకుతోంది. AICC పరిశీలకుడు జిల్లాలో పర్యటించి నివేదిక అందజేయనున్నారు. కంది శ్రీనివాసరెడ్డి, గోక గణేశ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సోయం పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News October 11, 2025
బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.
News October 11, 2025
దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది: తుమ్మల

దేశంలో గత ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. దొంగ ఓట్లతోనే మోదీ, అమిత్ షా బృందం అధికారంలోకి వచ్చిందన్నారు. శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓట్ చోరీ సంతకాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
News October 11, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

ఒడిశా విద్యార్థినిపై <<17976156>>అత్యాచారం <<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని WB సీఎం మమతను కోరారు.