News December 18, 2025

ADB హీరో.. WGL హీరోయిన్.. NZBలో క్లైమాక్స్

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ఆదిలాబాద్ యువకుడి కోసం వరంగల్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఇంట్లో చెప్పకుండా నిజామాబాద్ చేరుకుంది. NZB రైల్వే పోలీసులు ఆ బాలికను గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆమెను వరంగల్ పోలీసుల ద్వారా అప్పగించారు. ADBకు చెందిన యువకుడు NZB రమ్మనడంతో వచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడిపై వరంగల్ PSలో అపహరణ కేసు నమోదైనట్లు NZB రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు.

Similar News

News December 19, 2025

ఆరోగ్య శాఖ జీవోలపై విశాఖలో సమీక్ష

image

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు విశాఖలో పర్యటించనుంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన జీవోల అమలును సమీక్షించేందుకు 22న కలెక్టరేట్‌లో, 23న DMHO కార్యాలయం & ఆంధ్రా మెడికల్ కాలేజీలో కమిటీ సమావేశమవుతుంది. అనంతరం స్థానిక ప్రాంతాలను సందర్శించి, 23న రాత్రి తిరుగు ప్రయాణం కానున్నట్లు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర తెలిపారు.

News December 19, 2025

నితీశ్ కుమార్‌కు భద్రత పెంపు

image

ఇటీవల మహిళా డాక్టర్ హిజాబ్ లాగి విమర్శలు ఎదుర్కొంటున్న బిహార్ CM నితీశ్‌కు భద్రత పెంచారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిఘా సంస్థలు సూచించాయని అధికారులు తెలిపారు. నితీశ్‌కు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG) కఠినమైన భద్రతావలయాన్ని విధించినట్లు చెప్పారు. పరిమిత సంఖ్యలో ఉన్నతస్థాయి వ్యక్తులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అటు రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు.

News December 19, 2025

కోళ్లను పెంచాలనుకుంటున్నారా? ఈ జాతులతో అధిక ఆదాయం

image

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గం. మేలైన జాతి కోళ్లతో మంచి ఆదాయం సాధ్యం. వనరాజ, గిరిరాజ, స్వర్ణధార, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, కడక్‌నాథ్, వనశ్రీ, గాగస్, ఆసిల్ మేలైన జాతి కోళ్లకు ఉదాహరణ. ఇవి అధిక మాంసోత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి కలిగి, అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. ఇక BV 380 రకం కోళ్లు ఏడాదిలో 300కి పైగా గుడ్లు పెడతాయి. ఈ కోళ్ల జాతుల పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.