News April 22, 2025

ADB: హెడ్ కానిస్టేబుల్ బిడ్డకి సివిల్స్‌లో 68వ ర్యాంకు

image

హెడ్ కానిస్టేబుల్ కొడుకు సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంక్ సాధించి జిల్లావాసుల మన్ననలు పొందారు. ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్‌ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి గోవింద్‌రావు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించారు. చైతన్య మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించారు. మండలవాసి సివిల్స్ సాధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News April 23, 2025

విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: SP

image

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.

News April 23, 2025

ఆదిలాబాద్: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News April 22, 2025

ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి:  ADB SP

image

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.

error: Content is protected !!