News March 27, 2024
ADB: 10వ తరగతి మూల్యాంకన డబ్బులు విడుదల
గత సంవత్సరం ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన 10వ తరగతి మూల్యాంకన డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయుల ఖాతాలో మంగళవారం జమ చేసినట్లు అధికారులు తెలియజేశారు. 10నెలల తర్వాత ఎట్టకేలకు బకాయిలు చెల్లించడంతో ఉపాధ్యాయులకు ఊరటనిచ్చింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ.12.85 లక్షల నిధులు జమయ్యాయి.
Similar News
News January 10, 2025
బజార్హత్నూర్: ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ అరెస్ట్
అతిగా మద్యం తాగి ఆటో నడిపి ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ పాలెపు రాకేష్ ను గురువారం అరెస్టు చేసినట్లు బోథ్ సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న రాకేష్ అతిగా మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోను అజాగ్రత్తగా నడపడంతో బజార్హత్నూర్ మండలం దేగామ శివారులో ఆటో బోల్తా పడిందని, ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, గాయపడిన వారు చికిత్స పొందుతున్నారన్నారు.
News January 10, 2025
కలెక్టర్ చేతుల మీదుగా ట్రెసా క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)-2025 క్యాలెండర్ ను గురువారం సాయంత్రం 4గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
MNCL: ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సులేమాన్‌తో కలిసి కళాశాలలోని వివిధ విభాగాలు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు.