News March 20, 2025

ADB: 144 సెక్షన్ అమలు.. ఈ దుకాణాలు బంద్: SP

image

ADB జిల్లాలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144సెక్షన్) అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. మైకులకు, డీజేలతో, ఊరేగింపులకు, ధర్నాలకు, ప్రచారాలకు అనుమతులు లేవని తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసివేసి ఉంచాలని ఆదేశించారు.

Similar News

News March 20, 2025

ADB: ఈసారైనా స్టేట్‌లో సింగిల్ డిజిట్ వచ్చేనా..!?

image

పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, శ్రద్ధ వహించారు. గత 2023 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలవగా 2022లో 19వ స్థానంలో నిలిచింది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు.

News March 20, 2025

ఆదిలాబాద్‌: రేపటి నుంచి పది పరీక్షలు.. 52 కేంద్రాలు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10,106 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 5058, బాలికలు 4993, మొత్తం 10051 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 అమలు చేసి పకడ్బందీగా చేపట్టనున్నారు.

News March 20, 2025

ఆదిలాబాద్: నియోజకవర్గానికి 3500 ఇళ్ల మోక్షం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్‌ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.

error: Content is protected !!