News February 25, 2025
ADB: 3 రోజులు పత్తి కొనుగోలు బంద్

ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలిపారు. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య ఉన్నందున కొనుగోళ్లు జరగవని వెల్లడించారు. మార్చి 1నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Similar News
News November 27, 2025
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
News November 27, 2025
ఆదిలాబాద్లో బాల్య వివాహం అడ్డగింత

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.