News March 21, 2024
ADB: 40 ఏళ్ల నుంచి ఆ ఊరిలో నీరు ఇంకలేదు..!

ఆదిలాబాద్ లోని తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్ గూడకు గ్రామ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి చేతి పంపు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోరు వేసినప్పటి నుంచి అక్కడ నీరు ఉబికి వస్తోంది. అన్ని కాలాల్లో 24 గంటలు నీరు ఉంటుందని, భూమిలో నీటి ఊట ఎక్కువగా ఉన్నచోట ఇలా జరుగుతుందని ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ బోరింగ్ వల్లనే ఆ ఊరికి బోరింగ్ గూడ అని పేరు వచ్చిందన్నారు.
Similar News
News November 16, 2025
ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

అదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ 8.4°C, పొచ్చర 9, సత్నాల 9.5, సోనాల 9.6, పిప్పల్ దారి 9.8, అర్లి(T) 9.9, ఆదిలాబాద్ అర్బన్ 10.1, తలమడుగు 10.3, రామ్ నగర్ 10.4, భరంపూర్ 10.7, తాంసి 10.8, గుడిహత్నూర్ 11.3, హీరాపూర్ 11.4, సిరికొండ 11.6, ఇచ్చోడ, ఉట్నూర్(X రోడ్) 12.4°C లుగా నమోదయ్యాయి.
News November 15, 2025
EVM గోదాంను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శాంతినగర్లోని EVM గోదాంను కలెక్టర్ రాజర్షి షా శనివారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల స్థితి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా వ్యవస్థ, బ్యారికేడింగ్ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరీక్షించారు. EVM-VVPATల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదన్నారు. ప్రతి నెలా నిర్వహణ పద్ధతులను కచ్చితంగా పర్యవేక్షించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
News November 15, 2025
నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.


