News March 18, 2024
ADB: నిండు ప్రాణాన్ని బలిగొన్న చిన్నపాటి గొడవ
మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆదిలాబాద్‌కు చెందిన రాజు (30), సాగర్ ఓ వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం అక్కడే ఉన్న వినోద్, ప్రవీణ్‌లతో వారు గొడవపడ్డారు. దీంతో వినోద్, ప్రవీణ్ లు వారిని వెంబడించి టీటీడీ సమీపంలో దాడి చేశారు. ఈ దాడిలో రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, సాగర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
Similar News
News December 24, 2024
ADB: గ్యాస్ సిలిండర్ లీకేజీ.. తప్పిన ప్రమాదం
ఆదిలాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని హమాలీవాడకు చెందిన రాజు ఇంట్లో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన రాజు వంట గ్యాస్ పై దుప్పటి కప్పేశాడు. దీంతో మంటలు దుప్పటికి సైతం అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
News December 24, 2024
పెంచికల్పేట్: బాబోయ్ మళ్లీ పెద్దపులి కదలికలు?
కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివారు ప్రాంతంలోని ఎర్రగుంట సమీపంలో మళ్లీ పెద్ద పులి కనిపించినట్లు రైతులు పేర్కొన్నారు. పాలఓర్రే, మంగలి కుంట, కుమ్మరి కుంట, కంట్లం దారి, నక్కచెలీమ, లోడపల్లి కెనాల్ ఏరియా, లోడపల్లి ఎర్ర వాగు చెరువు ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందని తెలిపారు. కావున గ్రామ ప్రజలు అటవీలోకి వెళ్లారాదని. అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
News December 23, 2024
ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకోవాలి: నిర్మల్ ఎస్పీ
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలనిఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సహాయం కావాలన్నా వెంటనే డయల్ 100కు గాని స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.