News March 21, 2025

ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

image

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.

Similar News

News April 1, 2025

GDH: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

image

గుడిహత్నూర్ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగొంది జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్‌తో డివైడర్ల మధ్యలోని మొక్కలకు NHAI సిబ్బంది నీరు పడుతున్నారు. గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్‌ను ఢీకొంది. లారీ డ్రైవర్ మహమ్మద్ జలీంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు.

News April 1, 2025

ఆదిలాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

పండగల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో కిలో రూ:200, స్కిన్ లెస్ రూ:220 ధర పలుకుతుంది. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అమ్ముతున్నారు. గత నెలలో కిలో రూ.160 నుంచి 180 వరకు విక్రయాలు జరిపారు. గత రెండు నెలలుగా గిరాకి లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులకు.. తిరిగి చికెన్ విక్రయాలు ఊపందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 1, 2025

ADB: ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ను సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.

error: Content is protected !!