News March 21, 2025
ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.
Similar News
News March 28, 2025
అగ్నివీర్‌కు తాంసి యువకులు

తాంసి మండలం కప్పర్ల గ్రామానికి సందీప్, తన్వీర్ ఖాన్ అనే యువకులు గురువారం విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యారు. సందీప్ తండ్రి రమేశ్ వృత్తిరీత్యా వ్యవసాయం, తన్వీర్ ఖాన్ తండ్రి మునీర్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు.
News March 28, 2025
అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి: ADB DIEO

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిలాబాద్ ఇంటర్ విద్యాశాఖ అధికారి జాదవ్ గణేశ్ కుమార్ సూచించారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ కళాశాల గురించి వివరించాలని సూచించారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యాలను వివరించాలన్నారు.
News March 28, 2025
జిల్లాకు విమానాశ్రం మంజూరు చేయండి: MP నగేశ్

ADB జిల్లాకు విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని ఎంపీ నగేశ్ కోరారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వ్యూహాత్మకమైన ప్రాంతమని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని విధాలుగా సౌకర్యవంతమైన ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని కోరారు.