News March 16, 2025
ADB-ARMR రైల్వేలైన్‌కు మోక్షమెప్పుడో?

ADBజిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేస్తామని CM రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. కానీ అంతకుముందు ADB-ARMR రైల్వేలైన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ADB నుంచి NRML, ARMR, NZBకు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అయితే రైల్వేలైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు AIRPORT తెస్తామంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
Similar News
News February 26, 2026
కడప జిల్లాలో ఆహార తనిఖీకి సిబ్బంది ఎక్కడ?

కడప జిల్లా పుడ్ సేప్టీ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో హరిత ఒక్కరే ఉన్నారు. ఈమెకు సహాయంగా అసిస్టెంట్ పుడ్ కంట్రోల్ అధికారి రామచంద్రన్ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే జిల్లా అంతటా ఆహార నాణ్యత తనిఖీలు, శాంపిల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. ఫీల్డ్ స్టాప్ కొరతతో తనిఖీలు చేయలేకపోతున్నామన్నారు.
News February 26, 2026
కర్నూలు: హత్య కేసులో నలుగురి అరెస్టు

కర్నూలు ఖండేరి వీధికి చెందిన మనోహర్(40) హత్య కేసులో నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ వివరాల ప్రకారం.. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో మనోహర్‌పై పట్టణానికి చెందిన తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. నిందితుల నుంచి ఆటో, రెండు కత్తులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.
News February 26, 2026
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.


