News March 16, 2025

ADB-ARMR రైల్వేలైన్‌కు మోక్షమెప్పుడో?

image

ADBజిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేస్తామని CM రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. కానీ అంతకుముందు ADB-ARMR రైల్వే‌లైన్ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ADB నుంచి NRML, ARMR, NZBకు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే రైల్వే‌లైన్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. అయితే రైల్వే‌లైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు AIRPORT తెస్తామంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News

News November 11, 2025

డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

image

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.

News November 11, 2025

ఢిల్లీ పేలుళ్లు.. అర్ధరాత్రి వరంగల్‌లో ముమ్మర తనిఖీలు

image

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ట్రై సిటీ పరిధిలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, లగేజ్ బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు.

News November 11, 2025

IVR కాల్స్‌లో సంచలనాలు!

image

ఉమ్మడి కృష్ణా(D)తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని IVRs సర్వేలో తేలింది. అర్జీలు పెట్టుకున్న వారికి కాల్స్ చేయగా అధిక శాతం రెవెన్యూ అధికారులు లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదులందాయి. దీంతో సమస్యల పరిష్కార వివరాలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వాటిని సమీక్షించి CMకు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో క్షేత్రస్థాయి అధికారుల్లో భయం పట్టుకుంది.