News March 18, 2024
ADB: ముళ్లపొదల్లో మగశిశువు.. వెలుగులోకి సంచలన విషయం

ఇటీవల ఓ మగశిశువును ముళ్లపొదల్లో పడేసిన ఘటన భీంపూర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది మైనర్ బాలికగా గుర్తించారు. సదరు బాలిక గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వరుసకు బావనే గర్భం దాల్చడానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
Similar News
News April 9, 2025
ADB: విద్యార్థులకు GOOD NEWS.. అడ్మిషన్లు START

ADB జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. బీఏ(హెచ్ఈపీ), బీకాం (సీఏ), బీఎస్సీ, బీజడ్సీ, డాటా సైన్స్, స్టాటిస్టిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 9849390498 లేదా https://ttwrdcs.ac.in/Boat వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.
News April 9, 2025
ఇచ్చోడ: యాక్సిడెంట్.. నలుగురికి గాయాలు

ఎదురుఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలైన ఘటన మంగళవారం పెంబి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలం సల్లెడ గ్రామానికి చెందిన మాడవి శ్రీకాంత్, పోషన్న ఖానాపూర్ నుంచి పెంబి వస్తున్నారు. ఈ క్రమంలో పరిమండల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఎదురుఎదురుగా వస్తున్న బైక్‌ను భీకొని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు.
News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.