News March 21, 2025
ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్లో సత్తాచాటిన 25 మంది

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్, లారీ, కారు ఇలా ఒకదానినొకటి ఢీకొన్నాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న దేవేందర్గా ఒకరిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2025
సోనాలలో హల్చల్ చేసిన గంగవ్వ

సోనాలలోని ఓ పాఠశాలలో శుక్రవారం రాత్రి జరిగిన వార్షికోత్సవంలో మై విలేజ్ షో యూ ట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పాల్గొని సందడి చేశారు. గంగవ్వను చూడడానికి ప్రేక్షకులు దండెత్తారు. ప్రేక్షకులతో మై విలేజ్ షో యూట్యూబ్లో చేసిన అనుభవాలను పంచుకున్నారు. గంగవ్వతో సెల్ఫీలు దిగడానికి యువత ఆసక్తి కనబరిచారు.
News March 22, 2025
బ్యాంక్, జిల్లా అధికారులతో ADB కలెక్టర్ సమావేశం

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన శుక్రవారం DCC/DLRS సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఎం ఈజీపీ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా శక్తి పథకం, తదితర వాటిపై బ్యాంకర్లు, అధికారులతో వారి శాఖల లక్ష్యంపై సమీక్షించారు. పెండింగ్ అప్లికేషన్స్ లబ్ధిదారులతో ఈ నెల 24న సమావేశం నిర్వహించి వివరాలు సేకరించాలని, బ్యాంకు వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు.