News March 26, 2025

ADB: BC విద్యార్థులకు GOOD NEWS

image

BC విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ వాటాను డైరెక్ట్‌గా కళాశాలల ఖాతాలకు జమచేయనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు వారి బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పాస్ బుక్ కాపీని బీసీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నెల 27లోపు ONLINEలో పొందుపరుచాలని, లెటర్ హెడ్ పైన అకౌంట్ డిటేల్స్‌తో పాటు స్టేట్ మెంట్ కాపీ జత చేయాలని సూచించారు.

Similar News

News March 26, 2025

ఆదిలాబాద్: పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,050 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలకు గాను 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారు.

News March 26, 2025

ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రక్షాళన..?

image

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. రేపు ఢిల్లీలో DCC అధ్యక్షులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ పోటీచేయడంతో మాజీ DCC అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డిలను సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రేసులో ADB అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది, TPCC ప్రధానకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ZPTC గణేశ్‌రెడ్డి తదితరులున్నట్లు సమాచారం.

News March 26, 2025

ADB: తల్వార్‌తో INSTAలో పోస్ట్.. వ్యక్తిపై కేసు

image

తల్వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

error: Content is protected !!