News March 19, 2024

ADB: BJP ST మోర్చా ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

తెలంగాణ రాష్ట్ర 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  BJP ST మోర్చా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను రాష్ట్ర BJP ST మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ BJP ST ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, పెద్దపల్లి పార్లమెంట్ ST మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఆసిఫాబాద్ MLA అభ్యర్థి ఆత్మారాం నాయక్‌ని నియమించారు.

Similar News

News October 26, 2025

ADB: కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్

image

కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల(డీసీసీ) పదవుల్లో సైతం బడుగులకు ప్రాధాన్యతనివ్వనుంది. నిన్న ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% అధ్యక్ష పదవులు ఇవ్వాలని, గతంలో ఎలాంటి పదవులు చేపట్టని వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో డీసీసీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.

News October 26, 2025

ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

image

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్‌లు tgbie.cgg.gov.in పోర్టల్‌ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

​NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

image

ఆదిలాబాద్ ​కలెక్టరేట్‌లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్‌డీఓ రవీందర్ రాథోడ్, ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.