News April 13, 2025
ADB : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే మాజీ మంత్రి జోగు రామన్న, MLA అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Similar News
News April 14, 2025
అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయండి: ADB కలెక్టర్

ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.
News April 14, 2025
జైనథ్‌లో ఆరుగురు జూదరులు అరెస్ట్

జైనథ్‌లోని సావపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.16,830 సీజ్ చేశామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ సూచించారు.
News April 14, 2025
మావల: 12 మంది జూదరులపై కేసు

మావలలోని వాఘాపూర్ గ్రామ శివారులో ఆదివారం బహిరంగంగా పేకాట ఆడుతున్న 12 మందిని సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదుతో పాటు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మావల పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.