News May 24, 2024
ADB: Ed.CET రాసేందుకు వచ్చిన యువతి MISSING

Ed.CET పరీక్ష రాయటానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. పట్టణ టూ టౌన్ SI లాల్ సింగ్ నాయక్ తెలిపిన వివరాలు.. నిర్మల్‌కు చెందిన ఓ యువతి తన తండ్రితో ఆదిలాబాద్‌లోని నలంద కళాశాలలో పరీక్ష రాసేందు వచ్చింది. ఇద్దరూ బస్టాండ్లో దిగిన అనంతరం మూత్రశాలకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. పలు చోట్ల తండ్రి గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.

ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సాప్‌తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.