News May 24, 2024

ADB: Ed.CET రాసేందుకు వచ్చిన యువతి MISSING

image

Ed.CET పరీక్ష రాయటానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. పట్టణ టూ టౌన్ SI లాల్ సింగ్ నాయక్ తెలిపిన వివరాలు.. నిర్మల్‌కు చెందిన ఓ యువతి తన తండ్రితో ఆదిలాబాద్‌లోని నలంద కళాశాలలో పరీక్ష రాసేందు వచ్చింది. ఇద్దరూ బస్టాండ్లో దిగిన అనంతరం మూత్రశాలకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. పలు చోట్ల తండ్రి గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 14, 2025

ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు

News March 14, 2025

ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

News March 14, 2025

ADB: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

error: Content is protected !!