News April 13, 2025

ADB: FREE TRAINING& JOBS

image

ఆదిలాబాద్ బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్& ఫైనాన్స్‌లో ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ ఎగ్జామ్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 104 మంది APPLY చేయగా శనివారం 50 మంది ఎగ్జామ్ రాశారు. ఈ నెల 15న ఫలితాలు ప్రకటించనున్నారు. త్వరలో HYDలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తామని బీసీ సంక్షేమ అధికారి రాజలింగు తెలిపారు.

Similar News

News December 7, 2025

మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

image

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.

News December 7, 2025

కల్వకుర్తి: ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

image

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శనివారం సాయంత్రం కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ప్రజాప్రతినిధులు సహా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై మాధవ రెడ్డి సూచించారు. వాహనాల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

News December 7, 2025

ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

image

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.