News July 18, 2024
‘రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్’కు ADB $240.5 మిలియన్ల సాయం
దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రూఫ్టాప్ సోలార్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ADB) 240.5 మిలియన్ డాలర్ల(రూ.2వేల కోట్లపైనే) రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 2030 కల్లా 50 శాతం శిలాజ రహిత ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని భారత్ అందుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు ADB అధికారి తెలిపారు. ఇది పీఎం సూర్య ఘర్ కార్యక్రమంలో భాగం కానుందని పేర్కొన్నారు.
Similar News
News January 23, 2025
సరుకుతో పాటు ప్రయాణికులతో వెళ్లే రైళ్లు
ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఫ్రైట్ కమ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కింది అంతస్తులో సరుకు, పైన ప్రయాణికులు వెళ్లేలా డబుల్ డెక్కర్ లాంటి రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్డు రవాణాతో పోటీ పడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
News January 23, 2025
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.
News January 23, 2025
‘త్వరగా రావే.. టైమ్ అవుతోంది’
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?