News February 13, 2026
ADB: IIT, NITలకు ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News March 7, 2026
విజయవాడలో అర్ధరాత్రి డ్రగ్స్ పట్టివేత

విజయవాడలో శుక్రవారం రాత్రి డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి విజయవాడలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా టాస్క్ ఫోర్స్-మాచవరం పోలీసులు సంయుక్తంగా కలిసి అమ్మ కళ్యాణ మండపం సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 16 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్, 4 సెల్ ఫోన్లు, ఓ కాట మెషీన్ స్వాధీనం చేసుకున్నారు.
News March 7, 2026
గుంటూరు: రేపు గురుకులాల్లో ఖాళీ సీట్లకు ప్రవేశ పరీక్ష

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు 6, 7 తరగతుల అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.
News March 7, 2026
మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.


