News February 13, 2026
ADB: IIT, NITలకు ప్రవేశ పరీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.
Similar News
News March 15, 2026
తుంగతుర్తి: బ్రాహ్మణులకు MLA సామేలు క్షమాపణ

బ్రాహ్మణ సమాజంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల MLA మందుల సామేలు విచారం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని, పొరపాటున దొర్లిన మాటలే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల పట్ల తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యల వల్ల బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇటీవల ఆయన వ్యాఖ్యలపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
News March 15, 2026
ఏప్రిల్‌లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ డా. సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.
News March 15, 2026
కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.


