News February 13, 2026

ADB: IIT, NITలకు ‌ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.

Similar News

News April 8, 2026

కృష్ణా: గడ్డి ధరల దూకుడు.. పాడి రంగం కుదేలు

image

కృష్ణా జిల్లాలో పశు గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరం గడ్డి కొనుగోలుకు సుమారు రూ. 10,000 ఖర్చవుతుండగా, రవాణా, కూలీల ఖర్చులతో మరో రూ. 5,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మొత్తం రూ. 15 వేల వరకు ఖర్చు చేసినా సరిపడా గడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పశువుల పోషణ కష్టమై పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2026

NZB: ఆకతాయిలు.. అమ్మాయి వెంటపడితే అంతే

image

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ముఖ్యంగా NZB నగరంలోని ఖిల్లా ప్రభుత్వ కళాశాల, గిరిరాజ్ కాలేజీ వంటి విద్యాసంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. 3 నెలల్లో 150కి పైగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే 100 లేదా షీ టీమ్ ను సంప్రదించాలన్నారు.

News April 8, 2026

WGL: వంశీ కస్టడీ మృతిపై విచారణ

image

జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో 2023, మార్చి 7న జరిగిన వంశీ మృతి కేసుపై జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. కస్టడీలో ఉండగా వంశీ మరణించడంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు వరంగల్ RDO కార్యాలయంలో విచారణ జరగనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారు, సాక్షులు అందరూ తప్పనిసరిగా హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.