News March 16, 2024
ADB: ఇంటర్ పూర్తయిందా.. అయితే మీకే..!

పేద,మధ్య తరగతి కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలోని బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో వసతితో కూడిన ఉచిత బోధనకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుజ్యోతి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 12 వరకు టీజీఆర్డీసీ సెట్-2024 పేరిట ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
SHARE IT
Similar News
News January 22, 2026
ADB: ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు

ప్రత్యేకంగా ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 మండలాల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పలువురికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నార్నూర్, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నుర్, భీంపూర్ మండలాల్లోని 400 మంది యువకులకు మొదటి విడతలో భాగంగా లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.
News January 22, 2026
ఇంద్రవెల్లి: ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కృషి

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని పీవో యువరాజ్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని, తండాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
News January 22, 2026
జిల్లాలో 16,405 ఇండ్లు మంజూరు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 16,405 ఇండ్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.156 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా నాగోబా దర్బార్‌లో తెలిపారు. పీవీటీజీ కుటుంబాలకు ప్రత్యేకంగా 639 ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెందూర్ శాంతాబాయికి ఆహ్వానం లభించిందన్నారు.


