News January 24, 2025

ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు

image

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్‌లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.

Similar News

News February 8, 2025

ఉట్నూర్: సీఎంను కలిసిన కొమరం భీమ్ మనవడు

image

ఉట్నూర్: రాష్ట్ర పండుగగా కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కొమరం భీమ్ మనవడు సోనేరావు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలసి సన్మానించారు. రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

News February 8, 2025

ఉట్నూర్: ప్రజలు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే  

image

కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను శుక్రవారం ఎత్తి వేశారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ రాకేశ్‌ను ఎమ్మెల్యే కలిసి అటవీ శాఖ అధికారులను  తీరును ఆయన వివరించారు.

News February 7, 2025

ADB: రేపు పాఠశాలలకు సెలవు లేదు: DEO ప్రణీత

image

రేపు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాధికారి ప్రణీత  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఫిబ్రవరి 8 రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను యదావిధిగా నడపాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె సూచించారు. 

error: Content is protected !!