News November 12, 2024
ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News February 22, 2026
కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
News February 22, 2026
రేపు ఆదిలాబాద్‌కు కేటీఆర్.. బాల్క సుమన్‌తో భేటీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. జైలు వద్ద కేటీఆర్ పార్టీ శ్రేణులతో మాట్లాడే అవకాశం ఉంది.
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


