News November 12, 2024
ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల
కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
Similar News
News December 1, 2024
లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్
లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.
News November 30, 2024
లింగాపూర్: ఎంపీడీవో గుండెపోటుతో మృతి
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎంపీడీవో రామేశ్వర్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో అదిలాబాదులోని నివాసంలో ఎంపీడీవో రామేశ్వర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ లింగాపూర్ మండలానికి ఎంపీడీవోగా సేవ చేసిన రామేశ్వర్ మృతి పట్ల మండల వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
News November 30, 2024
కాగజ్‌నగర్: పెద్దపులితో ముగ్గురు.. ఏనుగుతో ఇద్దరు మృతి
కాగజ్‌నగర్ డివిజన్‌లో అడవి జంతువుల దాడిలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 NOV 18న పెద్దపులి దాడిలో దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్ మృతి చెందాడు. అదే నెల 29న కొండపల్లిలో నిర్మల అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. 2024 ఏప్రిల్‌లో ఏనుగు దాడిలో మరో ఇద్దరు మృతి చెందారు. కాగా నిన్న గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగేళ్లలో ఐదుగురి మృతి కలవరపెడుతోంది.