News March 11, 2025

ADB: LRSపై అధికారుతో కలెక్టర్ సమావేశం

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో LRS క్రమబద్ధీకరణ రుసుంపై మున్సిపల్, గ్రామపంచాయితీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. LRS అవుట్ క్రమబద్ధీకరణపై ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చ్31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25 శాతం రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 11, 2025

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

ADB: బిహార్ ముఠా.. నిందితుల వివరాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో పాత మొబైల్ ఫోన్లకు ఆయా వస్తువులు అమ్ముతున్న <<15720691>>బిహార్ ముఠా<<>> వివరాలను మంగళవారం పోలీసులు వెల్లడించారు. A1గా తబరాక్, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాగా గుర్తించారు. దీంతో సోమవారం సాయంత్రం బస్సు స్టాండ్ సరిహద్దుల్లో A3 నుంచి A6 వరకు మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News March 11, 2025

ADB: రేపు జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

error: Content is protected !!