News February 14, 2025
ADB: MH మద్యం స్వాధీనం.. ఒకరి ARREST

జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పార్డి (బి)లో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 46 దేశీదారు బాటిల్లు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. అక్రమంగా దేశీదారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 21, 2025
ADB: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు కీలకం: కలెక్టర్

జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో టీఎన్జీవో నూతన జిల్లా డైరీని అదనపు కలెక్టర్ శ్యామలాదేవితోపాటు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులు సమష్టిగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందు ఉంచాలని పేర్కొన్నారు.
News February 21, 2025
ADB: సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.
News February 20, 2025
ADB: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఆధార్ సర్వర్ పునరుద్ధరణ అయినట్లు, ఈనెల 21 శుక్రవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపనున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి గజానంద్ తెలిపారు. నాణ్యమైన పత్తిని మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. కౌడి పుచ్చుకాయ నిమ్ము పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయరన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మార్కెట్ యార్డ్ సహకరించాలని కోరారు.