News March 4, 2025

ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News December 12, 2025

జనవరి 23 నుంచి విశాఖలో బీచ్ ఫెస్టివల్

image

జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్‌పై కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తామన్నారు.

News December 12, 2025

నిర్మల్: రెండో విడత ఎన్నికలు జరిగే జీపీలు ఇవే

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 14 ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని నిర్మల్ రూరల్‌లో20, సారంగాపూర్ 32, సోన్ 14, దిలావర్పూర్ 12, నర్సాపూర్ జి 13, లోకేశ్వరం 25, కుంటాల 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

News December 12, 2025

రెండో విడత ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి పీఓలకు తమ ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు.