News March 4, 2025

ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News March 28, 2025

నేడు ప.గో జిల్లాలో పవన్ పర్యటన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ ప.గో జిల్లాలో పర్యటించనున్నారు. తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆయన ఆలోచన చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులతో సమావేశమవుతారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి, ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.

News March 28, 2025

కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

image

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?

News March 28, 2025

సంగారెడ్డి: భార్య సూసైడ్‌కు కారణమైన భర్తకు జైలు శిక్ష

image

ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల నిర్మాణ విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌కన్‌పేటకు చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై భార్య యాదమ్మను వేధించేవాడు. మద్యం తాగి వచ్చి భార్యను వేధిడంతో 2019లో ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో నేరం నిరూపణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

error: Content is protected !!