News March 4, 2025
ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News November 9, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<
News November 9, 2025
లైట్హౌస్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు రకరకాల పద్దతుల ఉపయోగిస్తారు. వాటిలో ఒకటే లైట్హౌస్ పేరెంటింగ్. ఈ పద్ధతిలో పిల్లలు జీవితంలో అన్నిట్లో రాణించాలని పేరెంట్స్ అనుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, విజయం వైపు వెళ్లడానికి వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది పిల్లలు నేర్చుకోవడానికి, సానుకూలంగా ఎదగడానికి సాయపడుతుంది. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారికి తోడుగా ఉంటారు. దీన్నే డాల్ఫిన్ పేరెంటింగ్ అని కూడా అంటారు.
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


