News March 4, 2025
ADB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News November 6, 2025
HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
News November 6, 2025
మహబూబాబాద్‌లో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు కానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ ప్రకటించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాలలు నేరాలకు పాల్పడితే, వారిని నేరస్థులుగా కాకుండా చట్టంతో ఘర్షణ పడిన వారిగా గుర్తించి, ఈ బోర్డు ద్వారా విచారిస్తారని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
News November 6, 2025
సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.


