News April 10, 2025

ADB: MSG UR SP.. నంబర్ ఇదే 8712659973

image

జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించాలని ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఎలాంటి సమస్యలున్నా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. 8712659973కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.

Similar News

News August 5, 2025

ఆదిలాబాద్ డీఈవోగా ఖుష్బూ గుప్తా

image

ఆదిలాబాద్ నూతన విద్యాశాఖ అధికారిగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో ఆమె డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు విద్యాశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News August 5, 2025

ADB: నేషనల్స్‌కు స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్

image

ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఎస్.చరణ్‌తేజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 3, 4 తేదీల్లో హనుమకొండ వేదికగా జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ట్రయాథ్లాన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరగనున్న పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రమేశ్ తెలిపారు.

News August 4, 2025

ADB: ‘సమస్యల పరిష్కారానికి కృషి’

image

ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థుల సమస్యలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.