News April 10, 2025
ADB: MSG UR SP.. నంబర్ ఇదే 8712659973

జిల్లా ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శకమైన సేవలను అందించాలని ‘మెసేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా ప్రజలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఎలాంటి సమస్యలున్నా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. 8712659973కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
Similar News
News August 6, 2025
తాంసి: ఒకరికి షోకాజ్ నోటీసులు

తాంసి PHCని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఒకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రిజిష్టర్ పరిశీలించి గైర్హాజరైన వారి వివరాలు డాక్టర్‌ను ఫోన్లో ద్వారా తెలుసుకున్నారు. తను అర్బన్ హెల్త్ సెంటర్ హమాలివాడలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పాల్గొన్నట్లు వైద్యులు శ్రావ్య వాణీ తెలిపారు. తాంసీ పీహెచ్సీలో విధులకు గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్ తేజకు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
News August 5, 2025
ఆదిలాబాద్: మెగా జాబ్ మేళా.. 296 మందికి నియామకం

ఆదిలాబాద్ ఎస్టీయూ భవన్లో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ జాబ్ మేళాకు మొత్తం 3,580 మంది అభ్యర్థులు హాజరుకాగా 396 మంది షార్ట్‌లిస్టు అయ్యారన్నారు. వీరిలో 296 మందికి నియామక ఉత్తర్వులు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కంపెనీలు అభ్యర్థుల వెరిఫికేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేశాయని ఆయన వివరించారు.
News August 5, 2025
ఆదిలాబాద్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఆదిలాబాద్‌లో మౌనిక అనే యువతి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉట్నూర్‌కు చెందిన ఆమె ఆదిలాబాద్‌లోని ఫుట్‌వేర్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ భుక్తాపూర్‌లో అద్దె గదిలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం గదికి వచ్చి ఉరేసుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించడంతో విషయం బయటకు తెలిసింది. మృతదేహాన్ని రిమ్స్ తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది