News December 19, 2025

ADB: PACS రద్దు చేసిన ప్రభుత్వం

image

PACS పాలకవర్గాలు రద్దు చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసింది. ఉత్తర్వుల ప్రకారం నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల పాలకమండళ్లు రద్దు కానున్నాయి.

Similar News

News December 21, 2025

VB-G RAM G బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

VB-G RAM G బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదలకు 125 రోజుల పనిదినాలను ఈ పథకం కింద అందిస్తారు. ఫారెస్ట్ ఏరియాల్లో జీవించే షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీలకు 150పనిదినాలు కల్పించేలా చట్టంలో NDA ప్రభుత్వం మార్పులు చేసింది. UPA హయాంలో 100రోజుల కనీస పనిదినాల లక్ష్యంతో తీసుకొచ్చిన MGNREGA పథకాన్ని కేంద్రం ఇటీవల రద్దు చేయడం తెలిసిందే.

News December 21, 2025

తూ.గో: ఇక ప్రతి ఆదివారం పండగే..!

image

రాష్ట్రంలో ఇక నుంచి ప్రతి ఆదివారం విద్యార్థులు, ఉద్యోగుల కోసం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం మండపేటలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి మంత్రి ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో MLA వేగుళ్ల జోగేశ్వరరావు, కమిషనర్ రంగారావు పాల్గొన్నారు.

News December 21, 2025

పాయకరావుపేట: చికిత్స పొందుతూ హెచ్‌ఎం మృతి

image

ప్రమాదంలో గాయపడిన పాయకరావుపేట మండలం ఎస్.నర్సాపురం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎం.ఝాన్సీ విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈనెల 20వ తేదీన విధులు ముగించుకుని పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్వగ్రామం వెళ్లడానికి బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కాలుకి తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.