News April 12, 2025
ADB: PMIS పథకానికి దరఖాస్తులు

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా డీఎంసీ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్/ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 21 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. జిల్లాలోని ఆసక్తి గల యువత https://pminternship.mca.gov.in/login/ వెబ్ సైట్‌లో ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 21, 2025
ADB: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
ఆదిలాబాద్: బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రెన్యూవల్ కాని 3 బార్ల నోటిఫికేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ADB ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫారమ్‌తో పాటు రూ.లక్ష డీడీ, చలాన్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పేరున చెల్లించి, ఈనెల 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు 8712658771 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News April 21, 2025
అనేక భాషలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్

ADB తెలంగాణ కశ్మీర్‌గా ప్రసిద్ధి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎండా, వాన, చలి అన్నీ ఎక్కువే. అంతేకాదండోయ్.. ఎన్నో భాషలకు పుట్టినిల్లు కూడా. తెలుగు ప్రజలు అధికంగా ఉన్నా ఉర్దూ, హిందీ మాట్లాడుతారు. MHకి సరిహద్దులో ఉండడంతో మరాఠీ, ఆదివాసీల గోండు, కొలాం, గిరిజనుల లంబాడీ, మథుర భాషలు ప్రత్యేకం. అందరూ కలిసి ఉండడంతో ఒక భాషలో పదాలు మరో భాషలో విరివిరిగా ఉపయోగిస్తుంటారు. మీదే భాషనో కామెంట్ చేయండి.