News February 6, 2025
ADB: అధికారులతో కలెక్టర్ సమావేశం
ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మల్వియా, DMHO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 6, 2025
ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త
అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్‌లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేశాడు.. కేసు నమోదైంది.
News February 6, 2025
సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి: ADB కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.
News February 6, 2025
బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్
బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన బండారి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మూడు రోజుల క్రితం నిందితుడు తన శనగ పంట చుట్టూ కరెంటు వైర్ అమర్చడంతో అతడి దగ్గర పని చేస్తున్న పాలేరు మేస్రం కృష్ణ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.