News March 6, 2025

ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

image

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.

Similar News

News March 6, 2025

నాకౌట్ మ్యాచుల్లో కుల్దీప్ ఫెయిల్.. మరో బౌలర్‌ను తీసుకోవాల్సిందేనా?

image

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

News March 6, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. ముగ్గురు మృతి

image

రావిర్యాల ORR ఎగ్జిట్ 13 వద్ద యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం.. ORRపై చెట్లకు నీళ్లు పడుతున్న సిబ్బందిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కార్ డ్రైవర్, కోప్యాసింజర్, ఫ్లాగ్ మ్యాన్ మృతిచెందారు. ఘట్కేసర్ వద్ద 3:15కు కార్ ఎంట్రీ అవ్వగా.. 3:30కి యాక్సిడెంట్ జరిగిందని, 15 MINలో దాదాపు 37 కి.మీ చేరుకునేంత ఓవర్ స్పీడ్‌లో వచ్చాడని అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

చికిత్స పొందుతూ రెండో విద్యార్థి కూడా మృతి

image

పుత్తూరు మండలం నేషనూరు గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి రవితేజ(17) మృతి చెందగా మరో విద్యార్థి మునికుమార్(18) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం చికిత్స పొందుతూ ముని కుమార్ కూడా మృతి చెందాడు. విద్యార్థులు కాలేజీకి బైకు మీద వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. చనిపోయిన ఇద్దరూ అన్న దమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

error: Content is protected !!