News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
Similar News
News December 13, 2025
రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.
News December 13, 2025
అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
News December 13, 2025
బాపట్ల జిల్లాలో అధికంగా ఎవరు మరణించారంటే..!

రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని బాపట్ల SP ఉమామహేశ్వర్ తెలిపారు. ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ఇటీవల చెరుకుపల్లిలో జరిగిన ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడం వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అనేక మంది బైక్ నడిపేవారే మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.


