News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News March 18, 2025

EPF నగదు విత్‌డ్రా మూడు రోజుల్లోనే..!

image

EPFలో క్లైయిమ్‌లు ఆటోమోడ్‌లో 3రోజుల్లోనే పరిష్కారమవుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2కోట్లకు పైగా క్లెయిమ్‌లు ఆటోమోడ్‌లోనే జరిగాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికమన్నారు. విత్‌ డ్రా పరిమితి రూ. లక్ష రూపాయలకి పెంచినట్లు పేర్కొన్నారు. త్వరలో EPFనగదు UPIద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం వచ్చే అవకాశం ఉంది.

News March 18, 2025

సిద్దిపేట: యువకుడి ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకి మండలంలో జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు.. మండలంలోని నరసింహులపల్లికి చెందిన కుసుంబ సాయి (22) కడుపునొప్పి భరించలేక సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. మృతుని తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

News March 18, 2025

సంగారెడ్డి: తండ్రి, కూతురు, కొడుకు అదృశ్యం..

image

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి అదృశ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్‌కు చెందిన గోపాల్ రెడ్డి (38) జనవరి 17న తన కూతురు తనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డిలతో కలిసి సంగారెడ్డికి వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదని స్థానిక ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అతని తల్లి గురడి శోభమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!