News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News March 18, 2025

GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి 

image

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.

News March 18, 2025

GOVT ఉద్యోగం సాధించిన సూర్యాపేట జిల్లా బిడ్డ

image

రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలను సోమవారం విడుదల చేయగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సైదులు బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. చిన్ననాటి నుంచే కష్టపడి చదివే వ్యక్తిత్వం ఉన్న సైదులు తాను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రయత్నించి, రాష్ట్ర స్థాయిలో 91వ ర్యాంక్ సాధించి హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్‌గా నియమితులయ్యారు.

News March 18, 2025

కామారెడ్డి: కోతి కల్లు తాగితే..!

image

ముందే కోతి.. ఆపై కల్లు తాగితే.. అనే సామెత నిజమనిపిస్తోంది ఈ చిత్రం చూస్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక చెట్టు వద్ద చెట్టు నుంచి కల్లు దింపిన గౌడన్న కింద మోటార్ సైకిల్‌కు కల్లు బిందెను ఉంచి మరో చెట్టు పైకి కల్లు కోసం వెళ్లగా ఇదే అదనుగా చూసిన కోతి కల్లును ఎంచక్కా తాగింది. అనంతరం నెమ్మదిగా జారుకుంది. ఇది చూసిన కొందరు ముందే కోతి.. ఆపై కల్లు తాగింది.. ఇప్పుడెలా అంటూ చర్చించుకున్నారు.

error: Content is protected !!