News June 27, 2024

ADB: ఆశల పల్లకిలో MLAలు.. మంత్రి పదవి ఎవరికో..?

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఊరిస్తోంది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రెండో విడత జరగబోతోందనే ప్రచారం నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలి విడత కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్క వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిని పదవి వరిస్తుందోననే ఆత్రుత నెలకొంది.

Similar News

News March 14, 2025

ADB: మూడు రోజులు కొనుగోళ్లు బంద్

image

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో కందులు, శనగ కొనుగోళ్లను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరీ తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ, ఆదివారం రావడంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతులు గమనించాలని కోరారు.

News March 14, 2025

గుడిహత్నూర్‌లో యువకుడి సూసైడ్

image

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.

News March 14, 2025

ADB: 16న ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!