News April 22, 2025

ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

image

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.

Similar News

News December 19, 2025

ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికలైనా ఆగని జంపింగ్లు

image

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. బూత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కనిపించగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కమలం తన బలాన్ని ప్రదర్శించింది. అయితే సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు నిధుల కోసం అధికార కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. ఇదిలా ఉండగా స్వతంత్రులు, మరికొందరు సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటే అందులోకి చేరి తమదైన గుర్తింపు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

News December 18, 2025

ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

image

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.

News December 18, 2025

ఆదిలాబాద్‌: స్కూలు వేళల్లో మార్పు

image

చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్‌ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9:40 గంటల- సాయంత్రం 4:30గం. వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.